నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం హమాల్ వాడిలో నరేష్(34) అనే యువకుడు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని దీంతో మనస్థాపానికి గురైన నరేష్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు స్థానికులు తెలిపారు. కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
