సారంగపూర్ హత్య కేసులో ట్విస్టు
పోలీసుల అదుపులో నిందితుడు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సారంగాపూర్ లో జరిగిన హత్య కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు పట్టణ ఆరో టౌన్ ఎస్ఐ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. సారంగపూర్ గ్రామానికి చెందిన సాయమ్మ తన మొదటి కూతురుకు దుబ్బాక లక్ష్మణ్ అనే వ్యక్తి తో వివాహం జరిపించింది. అయితే దుబ్బాక లక్ష్మణ్ నిత్యం దొంగతనాలు చేస్తూ జల్సాలు చేసేవాడు. దోపిడి కేసుల్లో కూడా నేరస్థుడు. జల్సాలకు అలవాటు పడిన లక్ష్మణ్ నెల రోజుల నుంచి తన నిత్యావసరాల కోసం తన అత్త సాయమ్మను డబ్బులు అడగడంతో ఆమె ఆ మొత్తాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేయడంతో ఆమె తన ఇంట్లోనే హత్యకు గురైంది. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా దుబ్చాక లక్ష్మణ్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.