నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాధన సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ వాల్ పోస్టర్ విడుదల చేయడం సంతోషకరమని, ఈ పోస్టర్ ఎందరికో అవగాహన కలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాధన సంస్థ సిబ్బంది మధుసూదన్, వినేష్ కుమార్, నిరీక్షణ తదితరులు పాల్గొన్నారు.
