నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
దుబ్బాలో రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆర్. సి. ఎఫ్. లిమిటెడ్ ఏరియా ఇంచార్జ్ సందీప్ కేశార్కర్, మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్ ,గడీల చంద్రశేఖర్ పాల్గొనగా పశు వైద్య శిభిరంను జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు.ఈ పశు వైద్య శిబిరంలో ఉచితముగా టీకాలు, పౌష్టిక ఆహారం ప్యాకెట్లు అందించారు. 72 పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేయడం జరిగింది.72 దూడలకు నటల నివారణ మందు త్రాగించడం జరిగింది. పశువులలో 8 కృత్రిమ గర్భధారణ, 33 సాధారణ చికిత్సలు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ పశు వైద్య శిబిరంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు ,డాక్టర్ రతన్ , మండల పశు వైద్య సిబ్బంది శ్రీనివాస్ ఎల్ ఎస్ ఏ,.నరేష్ వి ఏ, జావీద్ అష్రాఫ్, గంగారం, రింకు, దుబ్బ మాజీ కార్పొరేటర్లు శ్రీధర్ సురేష్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు