. . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..
రుద్రూర్, బతుకమ్మ :
గ్రామాన్ని అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి గెలిపించాలని బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా రుద్రూర్ మండలం లో సులేమాన్ నగర్ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించి, గ్రామాన్ని అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి గెలిపించాలని ఆయన స్పష్టం చేశారు. ఓటు హక్కు అనేది ప్రతి మానవునికి ఆయుధం లాంటిదని అన్నారు. గ్రామ మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్ సతీమణి ఆఫ్రిన్ బేగం సర్పంచ్ బరిలో నిలిచారని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి నారోజీ గంగారాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట సంగయ్య, గ్రామ మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
