గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సాలుర లో ఫ్లాగ్ మార్చ్ 

0 11,884

 

బోధన్, బతుకమ్మ : 

రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు  బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ హద్దుల్లో ఉన్న సాలూరా మండలం లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బోదన్ ఎసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, బోధన్ ఎస్ హెచ్ ఓ వెంకట నారాయణ, బోధన్ రూరల్ ఎస్ఐ మశ్చేంధర్, ఎడపల్లి ఎస్సై రమ , రెంజల్ ఎస్ఐ చంద్ర మోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ జరిగింది. ఈ సందర్భంగా ఎసిపీ మాట్లాడుతూ…. ఫ్లాగ్ మార్చ్ ప్రజల్లో నమ్మకం పెంపొందించడం , శాంతి భద్రతలు కాపాడడం ,ఎన్నికల ప్రక్రియలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడం లక్ష్యంగా నిర్వహించినట్లు తెలిపారు .ప్రజలందరూ ప్రభుత్వ యంత్రాంగానికి  సహకరించి , ఎన్నికల నియమాలు పాటించి, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు  వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో , గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడిన లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిజామాబాద్ కమిషనరేట్ ఈ ప్రాంతంలో స్వేచ్ఛాయుత , నిష్పక్షపాతంగా, శాంతియుత ఎన్నికలు నిర్వహించడానికి కట్టుబడి ఉంది  అని తెలియజేశారు.

 

Flag march in Salura in the wake of Gram Panchayat elections

Leave A Reply

Your email address will not be published.