30.2 C
Hyderabad

ప్రజల కోసమే ప్రధాని మోదీ జీవితం

Prime Minister Modi's life is dedicated to the people

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆశీర్వాద దీపం కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

ఇందూరు, బతుకమ్మ :

 

ప్రజల కోసమే ప్రధాని నరేంద్ర మోడీ తన జీవితాన్ని అంకితం చేశారని, నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం నగరంలోని రైల్వే స్టేషన్ ముందు ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  13 సంవత్సరాలు ముఖ్య మంత్రిగా, 12 సంవత్సరాలు దేశ ప్రధానిగా సేవలందిస్తూ దేశ ఔన్నత్యాన్ని చాటుతున్నారన్నారు. ప్రపంచంలో భారత్ ను విశ్వ గురువుగా నిలబెడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో అంతకు రెట్టింపు జరిగిందన్నారు. అన్ని వర్గాలకు అన్ని రంగాలకు సమన్యాయం చేస్తూ దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే  మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆశీర్వాద దీపం వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, శ్రావణ్ కుమార్, బంటు ప్రీతి, జ్యోతి, ఎర్రం సుధీర్, మల్కాయి మహేందర్, బట్టు రాఘవేందర్, పంచరెడ్డి అనిత, మహిళా మోర్చ అధ్యక్షురాలు వనిత, నాయకులు మల్లేష్ యాదవ్, బంటు ప్రవీణ్, ఇప్పకాయల కిషోర్, మురళి, మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article