. . . ఉపకులపతి ఆచార్య టి. యాదగిరి రావు
డిచ్ పల్లి, బతుకమ్మ :
తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 22న నిర్వహించబోయే యూనివర్సిటీ వార్షికోత్సవ పనులను వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.యాదగిరిరావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ యం.యాదగిరి మాట్లాడుతూ వార్షికోత్సవ నిర్వహణకు కావలసిన అన్ని పనులు ఈనెల 20 కల్లా పూర్తి అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య హారతి యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాంబాబు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ లక్ష్మణ్ చక్రవర్తి లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ప్రసన్న యూనివర్సిటీ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ ఆచార్య రవీందర్ రెడ్డి కల్చరల్ కమిటీ కన్వీనర్ ఆచార్య కె.లావణ్య పాల్గొన్నారు.