28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎంపీ లేఖకు స్పందించిన కేంద్రమంత్రి జయశంకర్

Must read

📰 Generate e-Paper Clip

  • ముగ్గురు తెలంగాణ వాసుల డెడ్ బాడీల తరలింపునకు ఏర్పాట్లు
  • మరణించిన కుంటుంబాలకు స్థానిక చట్టాల ప్రకారం పరిహారం
  • గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్సకు ఏర్పాట్లు

నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 15న దుబాయ్ లో రోడ్డు ప్రమాద ఘటన బాధితులను ఆదుకోవాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ ఎంపీ లేఖకు కేంద్ర మంత్రి మేయిల్ ద్వారా స్పందించారు. దుబాయ్ లో మెస్సర్ దార్విశ్ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేసే 83 మంది కార్మికులు అజ్మాన్ నుంచి కోర్ఫక్కన్ కు బస్సులో వెళ్తుండగా 15న రాత్రి 9గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అందులో 9మంది భారతీయులు చనిపోగా తెలంగాణ వాసులు ముగ్గురని తేలింది. ఈ నెల 16న భారత విదేశాంగ శాఖకు చెందిన అధికారులు కోర్ఫక్కన్ సందర్శించి చనిపోయిన వారిని గుర్తించడంతో పాటు సీరియస్ ఉన్న వారిని ఐసీయూలో మిగతా వారిని సాధారణ విభాగం వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. విదేశాంగ శాఖ సంబంధిత దార్విశ్ ఇంజనీరింగ్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతూ గాయపడిన వారికి వైద్య సేవలు అందించే ఏర్పాటు చేసింది. ఎవరైతే ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సంబంధిత ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీలను ఇండియాలోని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కేంద్రమంత్రి జయశంకర్ ఎంపీ అరవింద్ కు మెయిల్ ద్వారా సమాచారం అందించారు.

More articles

Latest article