ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని పల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన దుంపల బాలరాజ్ గత ఆరు నెలల నుండి తన కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవింగ్ చేసుకుంటూ హైదరాబాదులో జీవనం కొనసాగిస్తున్నాడు. అప్పుడప్పుడు తన ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు. ఆ విధంగానే ఈనెల తేది 5వ తారీఖున దేవునిపల్లి వచ్చి హైదరాబాద్ వెళ్ళాడు. మంగళవారం తన ఇంటి పక్కన ఉండే జగదీష్ ఫోన్ చేసి మీ ఇంటి తలుపులకు ఉన్న తాళం పగలగొట్టి ఉన్నదని తెలిపాడు. వెంటనే ఈ విషయం బాలరాజు తన కుటుంబ సభ్యులు దేవునిపల్లి కి వచ్చి ఇంటిని పరిశీలించగా ఇంట్లోని బీరువా తలుపులు పగలగొట్టబడి ఉండి బీరువాలోని సుమారు 80 తులాల వెండి ఆభరణాలు దొంగిలించబడ్డాయి. బాలరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు.

