27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • రిమాండ్ కు తరలింపు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన వన్ టౌన్ ఎస్ఎచ్ఓ బి.రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామానికి చెందిన సుల్తాన్ మోహినుద్దీన్ తన ద్విచక్ర వాహనంపై ఈనెల 7న తన కొడుకును నగరంలోని ప్రగతి హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అనారోగ్య కారణాల వల్ల డాక్టర్లు అక్కడే అడ్మిట్ చేయమని చెప్పారు. దీంతో తన కొడుకును అక్కడే అడ్మిట్ చేశాడు. తన వాహనాన్నిఆరోజు రాత్రి ఆసుపత్రి ముందు పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం బయటకు వచ్చి చూడగా తన ద్వి చక్రవాహనం కనబడలేదు. దీంతో ఆయన తన వాహనాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం నగరంలోని బోధన్ బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సరైన వాహన పత్రాలు లేక అనుమానాస్పదంగా తిరుగుతున్న డిచ్ పల్లి మండలంలోని నడిపల్లి గ్రామంలో గల గాంధీ నగర్ కు చెందిన సయ్యద్ మజద్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. తానే ద్వి చక్రవాహనాన్ని దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా గతంలో కూడా మరు మూడు ద్వి చక్రవాహనాలకు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుని నుండి నాలుగు ద్వి చక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్న అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచగా రిమాండ్ విధించారు. దీంతో నిందితున్ని జైలుకు తరలించారు.

More articles

Latest article