ఎనుగు రవీందర్ రెడ్డి కి బిగ్ షాక్..
నిజామాబాద్, బతుకమ్మ:
కాంగ్రెస్ పార్టికి చెందిన సీనియర్ నాయకులు యలమంచిలి శ్రీనివాస్ రావు ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ శ్రీ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ గందరగోళం సృష్టిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన యలమంచిలి శ్రీనివాసరావు అనే వ్యక్తి కి ఈ నెల 5 న పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నందుకు వివరణ ఇవ్వాలని వివరణ కోరుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ నోటీసు జారీ చేసింది. యలమంచిలి శ్రీనివాస రావు నుంచి ఎలాంటి సమాధానాలు ఇవ్వకపోగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి , కమిటీ సభ్యులు బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునే నాయకులు కార్యకర్తల అభిప్రాయాల మేరకు శుక్రవారం యలమంచిలి శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు 6 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. ఇటివల ఎల్లారెడ్డి నియోజకవర్గం నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ని సస్పెండ్ చేయడం ఇప్పుడు బాన్సువాడ సీనియర్ నాయకులు యలమంచిలి శ్రీనివాస్ రావు ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కలకలం రేపింది. యలమంచిలి శ్రీనివాస్ రావు పై వేటు తో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కి పెద్ద షాక్ అని చెప్పాలి. బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గం ఇంచార్జీగా ఎనుగు నియోజకవర్గం పట్టు సాధించారు. కానీ అనూహ్యంగా బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో నియోజకవర్గంలో రెండు వర్గాల పోరు మొదలైంది. కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే ఫైనల్ అని ఇటీవల పీసీసీ చీప్ మహేష్ కుమార్ స్పష్టం చేసిన తర్వాత బాన్సువాడ నియోజకవర్గంలో మళ్లీ గ్రూప్ రాజకీయాలు దాడులు కేసుల వరకు వెళ్లడంతో ఎనుగు వర్గీయులపై తొలి వేటు పడింది. ఉమ్మడి జిల్లాలో విస్తరించిన బాన్సువాడ నియోజకవర్గం పార్టీ నియోజకవర్గ ఇంచార్జిగా పెత్తనం చేస్తున్న ఎనుగు రవీందర్ రెడ్డి కి ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న యలమంచిలి ని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించడం ఆయన వర్గానికి షాక్ ఇచ్చినట్లయింది
