హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల చింతల్ కుంటలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఇద్దరిపై ఆదివారం వేకువజామున హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి పడటంతో వారు సజీవ దహనమయ్యారు. మృతులను యాచకులుగా భావిస్తున్నారు. పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఘటన స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించారు.
