29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బయలుదేరిన 10 నిముషాల్లో కూలిన హెలికాప్టర్

Must read

📰 Generate e-Paper Clip

యాత్రికులతో గుప్త కాశి నుంచి కేదార్నాథ్ కు వెళ్తుండగా ఘటన

చిన్నారి సహా, ఏడుగురి దుర్మరణం

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఉత్తరాఖండ్ లోని  గౌరీ కుండ్ లో బయలుదేరిన 10 నిమిషాలకే హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు. ఆర్యన్ ఏవియేషన్ కు  చెందిన హెలికాప్టర్ గుప్త కాశి నుంచి కేదార్నాథ్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో పైలెట్ కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5.20 గంటలకు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ లకు చెందిన ఆరు మంది యాత్రికులతో హెలికాప్టర్ గుప్తకాశి నుంచి కేదార్నాథ్ కు బయలు దేరింది.  అందులో సాంకేతిక సమస్యలు తలెత్తడం, వాతవరణం అనుకూలంగా లేకపోవడంతో బయలుదేరిన పది నిమిషాల్లోనే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, మే 2న కేదార్నాథ్ ద్వారాలు తెరుచుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఐదో ప్రమాదం.

Helicopter crashes 10 minutes after takeoff

More articles

Latest article