27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రెండు రోజుల మురిపెంగా కొనుగోలు కేంద్రం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రోజుకో సాకూ చెబుతూ కొనుగోళ్లు వాయిదా

 

. . . కొనుగోలు కేంద్రం వద్దే దళారుల దందా

 

. . . కొనుగోళ్లు ప్రారంభించాలని వేడుకుంటున్న రైతులు

 

జుక్కల్, బతుకమ్మ

 

జుక్కల్ మండలంలోని హంగర్గా క్లస్టర్ గ్రామంలో మే 2న సన్ ఫ్లవర్ ఆయిల్ పంట కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధికారులు ప్రారంభించారు. ప్రారంభించిన రెండు రోజులు కొనుగోలు చేసిన పంటను తరలించారు. గత 16 రోజులుగా కొనుగోలు నిలిపివేసి రైతులను పట్టిపీడిస్తున్నారు. రోజుకో సాకులు చెబుతూ గన్ని బ్యాగులు లేవని, రేపు వస్తాయని ఎల్లుండి వస్తాయని ఆశ చూపుతూ సమయాన్ని వృధా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మద్దతు ధర 7 వేల పై చిలుకు ఉండడంతో రైతులు సంతోషం తో పంటను కొనుగోలు కేంద్రానికి తెస్తే గత 16 రోజులుగా కొనుగోలు నిలిపివేసి రాత్రింబవళ్లు ఇక్కడే బస చేసిన రైతులకు నానా అవస్థలు పెడుతున్నారు. రాత్రిపూట విద్యుత్ సౌకర్యం లేక చీకట్లోనే పడుకుంటున్నామని, దోమలు కుడుతున్నాయని, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు ఇప్పటికే రెండుసార్లు పడి కింది భాగంలో నీరు వచ్చి సన్ ఫ్లవర్ పంటకు, విత్తనాలకు మొలకలు వచ్చి బూజు పట్టి దుర్వాసన వెదజల్లుతుందని తెలిపారు. ఇదే అదను గా భావించిన దళారులు రంగ ప్రవేశం చేసి కొనుగోలు కేంద్రాల వద్దే రైతులకు రూ.6 వేల కు కొనుగోలు చేస్తామని నానా రకాలుగా కండిషన్లు పెడుతూ కొనుగోలు చేస్తున్నారు. పట్టించుకోవలసిన సొసైటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్నారని రైతుల ఆరోపిస్తున్నారు. కనీసం త్రాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నా తరుణంలో దుక్కులు దున్నుకోవడం చెత్తలు ఏరడం వ్యవసాయ పనులను ఆపేసి 16 రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే రాత్రి పగలు పడిగాపులు కాస్తూ నానా అవస్థలు పడుతున్నామని, అడిగే వారు లేరని అన్నారు. ఇప్పటికైనా సొసైటీ అధికారులు వెంటనే సన్ ఫ్లవర్ ఆయిల్ పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కొనుగోలు చేయకపోతే జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే కొనుగోలు ప్రారంభించే విధంగా అధికారులకు ఆదేశించాలని రైతులు వేడుకుంటున్నారు.

More articles

Latest article