- ఆరు బైకులు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బైక్ దొంగతనాలు చేసి అమ్ముకొని జల్సా చేసుకొటు… పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపితే , జైలు నుంచి వచ్చిన తరువాత మళ్లీ దొంగతనాలు చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎసిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడుతు… కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామానికి చెందిన పిట్ల మొగులయ్య ఈ ఏడాది మే 5న నిజామాబాద్ ఆర్టిసి బస్ స్టాండ్ వద్ద పార్కింగ్ ఏరియాలో తన బైక్ ను పార్క్ చేసి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం నిజామాబాద్ నగర ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి ఆధ్వర్యంలో పోలీసులు బోదన్ రోడ్డులో వాహనాల తనీఖీలు నిర్వహించారు. ఇద్దరు యువకులు బైక్ పై వెలుతుండగా పోలీసులు ఆపి పత్రాలు చూపించాలని కోరగా వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకొని విచారించగా బోధన్ పట్టణంలోని అజాం గంజ్ కు చెందిన మాలోత్ రమేష్ అలియాస్ తులిసిరాం తో పాటు బోదన్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన కటం రవి అలియాస్ సద్ధంలని గుర్తించారు. వారు బాసర నుంచి ఒక్కటి, తిర్మన్ పల్లి లో ఒకటి, నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతం నుంచి ఒకటి, వికారాబాద్ జిల్లా తాండూర్ నుంచి ఒక్కటి, నగరంలోని గ్లామర్ హోటల్ నుంచి 1, విక్లీ మార్కేట్ నుంచి మొత్తం ఆరు బైకులు దొంగిలించారని పోలీసుల విచారణలో తేలింది. వారి వద్ద నుంచి ఆరు బైక్ లను రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. గతంలో మాలోత్ రమేష్ ఒక బైక్ ను దొంగతనం చేయగా కటకం రవి బోదన్, నిజామాబాద్ ఏరియాలలో రెండు బైక్ లు చోరీ చేయగా అరెస్టు చేసి జైలు జీవితం గడిపిన మారకుండా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇద్దరి పై అర్గనైజడ్ క్రైం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. ఈ విలేఖరుల సమావేశం లో సిసిఎస్ ఎసిపి నాగేంధ్ర చారీ తదితరులు ఉన్నారు.

