25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

హత్యకేసులో ఇద్దరు అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈ నెల 25న జరిగిన హత్య కేసులో శనివారం ఇద్దరిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హచ్ఓ బి.రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 25న నగరంలోని సంతోష్ నగర్ కు చెందిన వాస్టర్ రాజేష్(51) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజేష్ కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఇద్దరు నేరస్థులను అరెస్టు  చేశారు. నగరంలోని గరుద్వార్ గాజుల్ పేట్ కు చెందిన రాంజీ భీమల్ బాడీ(30)ను ఏ1గా, అదే ప్రాంతానికి చెందిన షేక్ సికిందర్(28) ను ఏ2గా అరెస్టు చేశారు. ఈ నెల25న రాజేష్, రాంజీ భీమల్ బాడీ, షేక్ సికిందర్ ముగ్గురు కలిసి ముస్తయి దర్గా చౌరస్తా వద్ద మద్యం సేవించారు. అదే సమయంలో వీరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు కలిసి రాజేష్ ను నెట్టేశారు. దీంతో రాజేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడని విచారణలో తేలింది. ఇద్దరు నేరస్తులను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం  ముందు హాజరు పరిచి రిమాండ్  కు తరలించారు.

More articles

Latest article