. . . 8 మంది మావోయిస్టుల మృతి ?
. . . భారీగా అయుదాలు స్వాధినం
ములుగు, బతుకమ్మ:
పిఎల్జిఏ వారోత్సవాలకు ఒక రోజు ముందు తెలంగాణలో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ- చత్తీస్ ఘడ్ సరిహద్ధులో అదివారం తెల్లవారు జామున బారీ ఎన్ కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చలపాక సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం…
ఈ ఎదురు కాల్పుల ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గా చెప్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో కుర్సం మంగు అలియాస్ భద్రు , అలియాస్ పాపన్న (టిఎస్ సియం సెక్రటరీ యెల్లందు – నర్సంపేట) గా చెబుతున్నారు. ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు (డివిసియం కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ఏసీ), ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్ (ఎసియం) , ముస్సాకి జమున (ఎసియం), మావోయిస్టు ధళ సభ్యులు జైసింగ్ , కిషోర్, కామేష్ లు ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయినట్లు సమాచారం. మరోకరిని గుర్తించాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాలని వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో రెండు ఎకే 47 రైపిల్స్ తో పాటు బారీగా అయుదాలు స్వాధినం చేసుకున్నారు.

