27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ లో పసుపు సీజన్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

. . . సీజన్ ను ప్రారంభించిన చైర్మెన్ ముప్పా గంగారెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ లో 2024-25 సీజన్ కు సంబందించిన పసుపు కొనుగోలును మార్కేట్ కమీటి చైర్మెన్ ముప్పా గంగారెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కిసాన్ మీటింగ్ హాల్ లో జరిగిన సమావేశంలో అధికారికంగా పసుపు సీజన్ నీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్బంగా వ్యాపార వర్గాలతో సమావేశం నిర్వహించి మాట్లాడుతు…. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు ఎండిన పసుపు తీసుకువస్తే క్వింటాళ్ కు రూ. 10వేలకు తగ్గకుండా ఇస్తాం అని హామీ ఇచ్చారు. ఈ సీజన్ లో గతంలో కంటే మంచి ధర లభిస్తుందని రైతులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కేట్కమిటి డైరెక్టర్ మల్లేష్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ , మార్కెట్ కమిటీ సభ్యులు లాబన్ , శంకర్ దాస్ , మధుసుదన్ , మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ కిషోర్ తది తరులు పాల్గొనడం జరిగింది.

Turmeric season begins in Nizamabad Agricultural Market

 

More articles

Latest article