రుద్రూర్, బతుకమ్మ : గ్రామపంచాయతీ కార్మికుల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం గ్రామపంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటీయు నాయకులు నన్నేసాబ్ మాట్లాడుతూ.. జీవో నెం. 60 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. అదేవిధంగా ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు నర్సింలు, వహీద్, సాయిలు, శంకర్, గంగారం, సతీష్, సాయవ్వ, లింగవ్వ, నీలవ్వ తదితరులు పాల్గొన్నారు.