29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

టీఎస్ యూటీఎఫ్ బడిబాట కరపత్రాల ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మన పిల్లలను మన ఊరి బడిలో చేర్పిద్దాం.. నాణ్యమైన విద్యను పొందుదాం.. ఫీజుల భారాన్ని తగ్గించుకుందాం.. అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రచార జాతా కరపత్రాలను  జిల్లా విద్యా శాఖ అధికారి పి. అశోక్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచే కార్యక్రమాన్ని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం అభినందనీయం అని అన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులందరు బడిబాట కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్, జిల్లా అధ్యక్షులు ఓ. రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్, జిల్లా ట్రెజరర్ ఎన్.రాజారామ్, జిల్లా కార్యదర్శి వి.సాయన్న, జిల్లా కమిటీ సభ్యులు ఎమ్.బాజన్న, టి.లింగం పాల్గొన్నారు.

TS UTF school brochures launched

More articles

Latest article