నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మన పిల్లలను మన ఊరి బడిలో చేర్పిద్దాం.. నాణ్యమైన విద్యను పొందుదాం.. ఫీజుల భారాన్ని తగ్గించుకుందాం.. అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రచార జాతా కరపత్రాలను జిల్లా విద్యా శాఖ అధికారి పి. అశోక్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచే కార్యక్రమాన్ని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం అభినందనీయం అని అన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులందరు బడిబాట కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్, జిల్లా అధ్యక్షులు ఓ. రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్, జిల్లా ట్రెజరర్ ఎన్.రాజారామ్, జిల్లా కార్యదర్శి వి.సాయన్న, జిల్లా కమిటీ సభ్యులు ఎమ్.బాజన్న, టి.లింగం పాల్గొన్నారు.
