25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సెంట్రింగ్ కార్మికుల మహాధర్నాకు టీఆర్ఎస్ చీఫ్ కవిత మద్దతు

Must read

📰 Generate e-Paper Clip

 

 

. . .  రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే వాళ్లతో పాటు ధర్నాలో కూర్చుంటా

 

. . . సెంట్రింగ్ కార్మికుల డిమాండ్లను పట్టించుకోకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టటం ఖాయం

 

. . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

 

. . . ఇందిరా పార్క్ వద్ద సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో పాల్గొని వారికి మద్దతు తెలిపిన కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

హైదరాబాద్ లో అద్దాల మేడలు కనిపిస్తున్నాయంటే దానిలో సెంట్రింగ్ కార్మికుల కృషి ఎంతో ఉందని, తాళ్లు కట్టుకొని ప్రాణాలు పణంగా పెట్టి  గాలిలో వేలాడుతూ మీరు పనిచేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శనివారం సెంట్రింగ్ కార్మకుల ధర్నాలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. సెంట్రింగ్ కార్మికుల సమస్యలు రెండు రోజుల్లో పరిష్కారం చూపకపోతే నేను కూడా ధర్నాలో కూర్చుంటానన్నారు. ఎన్ని రోజులైనా సరే మీ సమస్య తీరే వరకు ప్రభుత్వం ఒత్తిడి పెంచుతామని, సెంట్రింగ్ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోకపోతే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చివాత పెడతారని అన్నారు. 2 లక్షల రూపాయల పనికోసం మీరు వెళ్తున్నప్పటికీ మీతో పాటు 15 లక్షల రూపాయల మెటీరియల్ తీసుకెళ్తున్నారని, కానీ మీ మెటీరియల్ కు కనీసం రక్షణ లేని పరిస్థితి ఉందన్నారు. ఈ గుంపు మేస్త్రీ వచ్చాక తెలంగాణ అందరి పరిస్థితి ఆగమవుతోందని, అందుకే గుంపు మేస్త్రీ హఠావో…తెలంగాణ బచావో అంటున్నానన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత నోటీసులు లేకుండా ఇళ్లు కూలగొడుతున్నారని, దీంతో సెంట్రింగ్ పనిచేస్తున్న మీకు ఆ ఇళ్లు కూల్చే సమయంలో మీ మెటీరియల్ నష్టపోతున్నారని దీనికి ఇంటి యాజమాని గానీ ప్రభుత్వం గానీ మీకు పరిహారం ఇవ్వటం లేదన్నారు. 86 చోట్ల సెంట్రింగ్ కార్మికులు, కాంట్రాక్టర్లు పది రోజులుగా పని బంద్ చేశారని, కానీ మీ దగ్గర ఉన్న కూలీలను సెంట్రింగ్ లే సాధుతున్నారన్నారు. సెంట్రింగ్ కార్మికులు గొంతెమ్మ కోరికలు ఏమీ లేవని, 12 అంశాలతో చాలా చిన్న విషయాలే అడుగుతున్నారన్నారు. వారికి ఈఎస్ఐ కార్డులు, స్క్వేర్ మీటర్ కు 51 రూపాయలు, కార్మికులు చనిపోతే ఇచ్చే డబ్బులు పది నుంచి 20 లక్షలు అడుగుతున్నారని వాళ్లు అడిగే అన్ని డిమాండ్లు కూడా సహేతుకమైనవేనని, వాటికి మేము మద్దతు తెలుపుతున్నామన్నారు. ఇప్పుడు మేస్త్రీలు స్వ్కేర్ ఫీట్ కు 4 వందలు అడుగుతున్నారని చెబుతున్నారని దానిలో సెంట్రింగ్ కార్మికుల వాటా ఎంతో కూడా చెప్పాలన్నారు. మేస్త్రీల చేతిలో ఎట్టి పరిస్థితుల్లో మీ జుట్టు ఉండకూడదని, తెలంగాణ రక్షణసేన అధికారంలో వచ్చిన తర్వాత మీ అన్నిడిమాండ్లను తీరుస్తామని, 186 చోట్ల వెయ్యి నుంచి 2 వేల గజాల స్థలం మీకు ఇస్తామని అన్నారు. ప్రతి మండలంలో సెంట్రింగ్ కార్మికుల సంఘాలు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు.

More articles

Latest article