29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

హిట్ అండ్ రన్ కాదు… పక్కా మర్డర్

Must read

📰 Generate e-Paper Clip

. . .  హైదరబాద్ లో లాయర్ హత్య

. . . వక్ఫ్ భూముల వ్యవహారం కారణమని నిర్ధారణ

 హైదరాబాద్, బతుకమ్మ:

హైదరాబాద్‌లో సంచలనం.. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ హత్య కేసుగా మారిన హిట్‌ అండ్‌ రన్‌..హైదరాబాద్‌లో సంచలనం రేపిన మాసబ్‌ట్యాంక్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కారుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ చికిత్స పొందుతూ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. దీంతో ఈ ఘటనను పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం.. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.మొదట హిట్‌ అండ్‌ రన్‌గా నమోదు చేసిన కేసును, సిసి టివి పుటేజీలతో స్థానికంగా దోరికిన సాక్ష్యాలతో మొయినుద్దీన్‌ మృతి అనంతరం హత్య కేసుగా మార్చారు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వక్ప్  భూవివాదం నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుల కోసం ప్రత్యేకంగా 5 బృందాలతో గాలింపు చేపట్టారు.

Not a hit and run... definitely murder

More articles

Latest article