నందిపేట్, బతుకమ్మ : ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా డొంకేశ్వర్ మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూమేష్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరులేనివన్నారు. కార్యక్రమం లో డొంకేశ్వర్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
