ఇందిరా గాంధీకి నివాళి

నందిపేట్, బతుకమ్మ :  ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా   డొంకేశ్వర్ మండల కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ  మండల అధ్యక్షులు భూమేష్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరులేనివన్నారు. కార్యక్రమం లో డొంకేశ్వర్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,  యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.