. . . 24 గ్రూపుల ఆర్థిక లావాదేవీలపై సీఏ ఆడిట్
. . . ఇందల్వాయి మండలంలో మహిళా సంఘాల సామాజిక తనిఖీ పూర్తి
. . . ముగిసిన మహిళా గ్రూపుల వార్షిక లెక్కల పరిశీలన
ఇందల్వాయి, బతుకమ్మ :
మండల పరిధిలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక జవాబుదారీతనం పెంపొందించడమే లక్ష్యంగా సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 24 గ్రామ సంఘాల పరిధిలోని మహిళా గ్రూపుల సామాజిక, ఆర్థిక లావాదేవీలను చార్టర్డ్ అకౌంటెంట్ చేత సమగ్రంగా ఆడిట్ చేయడం జరిగిందన్నారు. మహిళా సంఘాలు పొందిన పొదుపు మొత్తాలు, బ్యాంక్ లింకేజీ రుణాలు, అంతర్గత అప్పుల పంపిణీ రికవరీలకు సంబంధించిన రికార్డులను అధికారులు, ఆడిట్ బృందం నిశితంగా పరిశీలించారు. ప్రతి పైసాకు సంబంధించిన లెక్కలను పారదర్శకంగా రికార్డుల్లో నమోదు చేసినట్లు ఆడిట్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ఆడిట్ నిర్వహించడం వల్ల సంఘాల్లో నిధుల దుర్వినియోగానికి ఆస్కారం ఉండదని, సభ్యుల మధ్య నమ్మకం ఐక్యత పెరుగుతుందని హెచ్ బి తెలిపారు. రికార్డులను సక్రమంగా నిర్వహించిన మహిళా సంఘాల ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డి. పి. ఎం కిరణ్,ఎ. పి ఎం , సీసీ లు, ఉదయ్, స్వప్న, పండరి, రూమెంద్ర, గ్రామ సంఘం అధ్యక్షులు,స్థానిక ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
