కాసేపట్లోబదిలీ ఉత్తర్వులు

0 2,755
  • ఉత్కంఠకు తెర
  • నిలిచిపోయిన బదిలీ ఉత్తర్వులను రిలీజ్ చేయనున్న సీఎండీ

బతుకమ్మ, నిజామాబాద్ : విద్యుత్ శాఖలో ఇటీవల నిలిచిపోయిన బదిలీ ఉత్తర్వులు మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. గత నెల 28 నుంచి బదిలీ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈనెల 7 న సాయంత్రం ఉత్తర్వులు జారీ అవుతాయని రాత్రి వరకు ఎదిరిచూసారు.ధర్పల్లి మండల కేంద్రంలో విద్యుత్ నిలచిపోయిన కారణంతో పాటుగా నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసాకే బదిలీలు చేపట్టాలని రాజధానిలో యూనియన్ నాయకులు సీఎండీలకు సూచించారు. మద్యంతరంగా నిలిచిపోయిన ఉత్తర్వుల కోసం ఉద్యోగులు గత నాలుగు రోజులగా ఎదిరిచూస్తున్నారు. నాయకులు సూచించిన విషయాలను బదిలీల అనంతరం పరిశీలిస్తామని ముందుగా ఉత్తర్వులను ఇవ్వాలని నిర్ణయించారు.దానిలో భాగంగానే బదిలీ ఉత్తర్వులను దసరాకు ముందు రోజు కంపేనీ సీఎండీ వరుణ్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.