నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ తిరుపతిని వీఆర్‌కు అటాచ్ చేశారు. ఆర్మూర్ పీఎస్ ఎస్సై–1 మహేశ్‌ను వీఆర్‌కు పంపించారు. మెండోరా ఎస్సై నారాయణను వీఆర్‌కు అటాచ్ చేశారు. సీసీఎస్‌లో ఉన్న రమేశ్‌ను ఆర్మూర్ పీఎస్ ఎస్సై–1గా నియమించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా పీఎస్ ఎస్సై మాలిక్ రెహమాన్‌ను జక్రాన్‌పల్లి ఎస్సైగా బదిలీ చేశారు. రెండో టౌన్లో ఉన్న ఎస్సై యాసిర్ అరాఫత్‌ను మెండోరా ఎస్సైగా నియమించారు. జగిత్యాల్ వీఆర్‌లో ఉన్న సయ్యద్ ఇమ్రాన్‌ను రెండో ఎస్సై–1గా ట్రాన్స్ఫర్ చేశారు.
