27.3 C
Hyderabad
Friday, July 31, 2026

కేసుకో రేటు

Must read

📰 Generate e-Paper Clip

  • బోధన్ సబ్ డివిజన్ లో స్పెషల్ ఆ ఠాణా
  • పంచాయితీలు, సెటిల్ మెంట్ లకు అడ్డాగా ఆ ఠాణా
  • ఆ పోలీస్ స్టేషన్ పై ఎప్పుడూ ఆరోపణలే

 

బోధన్, బతుకమ్మ: బోధన్ సబ్ డివిజన్ లోని ఆ పోలీస్ స్టేషన్ లో పంచాయితీలు, సెటిల్ మెంట్ లు సర్వసాధారణం అయిపోయాయని, కేసుకో రేటు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఠాణాకు వెళ్లే వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోవడంతో డయల్ 100కు లేదంటే ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఇటీవల బోధన్ మండలంలో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులను పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుందని పలువురు అంటున్నారు. పేకాట స్థావరాలుఇసుక టిప్పర్ ల పట్టివేత వంటి కొన్ని కేసుల నమోదు తీరును పరిశీలిస్తే స్థానిక పోలీసుల పనితీరు అమర్థమవుతుందని పేర్కొంటున్నారు. ఇటీవల ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి పై దాడి కేసులో బాధితులు రెండు రోజుల అనంతరం 100కి డయిల్ చేసి సమాచారం అందజేస్తే  విచారణ చేపట్టారు.  ఓ పోక్సో కేసులో నిందితుడు దొరికినప్పటికీ అతడి స్నేహితులను విచారణ పేరుతో భయ బ్రాంతులకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయి. అర్ధరాత్రి ఇసుక, మొరం అక్రమ రవాణా వ్యవహారంలో రూరల్ ఎస్సై వ్యవహార శైలి పై అనేక ఆరోపణలు వస్తున్నా ఉన్నతాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాల్లో కొన్నింటి పై మాత్రమే కేసులు చేస్తున్నారని మరికొన్ని ముడుపులు తీసుకొని వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

  • సోషల్ మీడియాలో హెచ్చరిక..

బోదన్ సబ్ డివిజన్లో ఆ పోలీస్ స్టేషన్ చాలా ఫేమస్. గత పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హయాంలో ఎస్ఎచ్ఓకు ఇసుక వ్యాపారుల ద్వారా నెలవారి మామూళ్లే రూ.10లక్షల పైమాట. గతంలో పనిచేసిన ఎస్ఐని మూడేళ్లు కాకముందే బదిలీ చేయడం వెనుక వసూళ్ల దందానే కారణమని ఇంటలిజెన్స్ డీజీపీకి నివేదిక అందించింది. అక్కడ పోస్టింగ్ కోసం నానాతంటాలు పడేవారు కొన్ని రోజుల్లోనే డబ్బుల మూటలు మోస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఎస్సై తన తీరు మార్చుకోవాలని సాలురాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, టిప్పర్ యజమాని ఒకరు సోషల్ మీడియా లో హెచ్చరించిన సంఘటన చర్చనీయాంశమైంది. పోలీస్ స్టేషన్ లో చిన్న చిన్న అవసరాలంటూ బాధితుల నుంచి పెద్ద మొత్తం లో మామూళ్లు వసూలు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. సిద్దాపూర్ ఇసుక క్వారీ నుంచి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదనే పలువురు అంటున్నారు. మూడు నెలలుగా అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా అవుతోందనే ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి టిప్పర్ లు, జేసీబీలు స్వాధీనం చేసుకోవడం కల కలం రేపింది. పోయిన నెల ఈ నెల మొదటి వారంలో కండ్ గావ్ గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఇసుక మాఫియా దారులు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంటికి రాత్రి వేళల్లో వెళ్లడం బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కేసు నమోదు చేయకపోగా వారిని కూర్చోపెట్టి గంటలు గంటలుగా పంచాయతీ పెట్టడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి వేళల్లో ఇసుకడంపు జరుగుతున్న విషయం పోలీసులకు తెలపడంతో తెలిపిన వారి వివరాలు ఇసుక మాఫియాకు పోలీసులు చేరవేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

  • పేకాట నిర్వాహకుల నుంచి మామూళ్లు..

సాలురా, బెల్లాల్, సాలంపాడ్, కల్దుర్కి, సిద్దాపూర్, పెంటకలాన్  శివార్లలో పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే స్థానిక పోలీసులు అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేయడం మినహా కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి పేకాట స్థావరాల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వాహకుల వద్ద మామూళ్ల వ్యవహారం ఉండటంతోనే నది పరివాహక ప్రాంతాల్లో మనుషులను పెట్టించి పేకాటను క్లబ్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా  నిర్వహిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. న్యాయం కోసం పోలీసు స్టేషన్ కు వస్తే న్యాయం జరగక పొగ డబ్బులు చెల్లించు కోవాల్సి వస్తుందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More articles

Latest article