Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 11:10 pm Posted by : ramakrishna

ఎస్ఐల బదిలీ

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జక్రాన్​పల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ తిరుపతిని వీఆర్​కు అటాచ్​ చేశారు. ఆర్మూర్​ పీఎస్​ ఎస్సై–1 మహేశ్​ను వీఆర్​కు పంపించారు. మెండోరా ఎస్సై నారాయణను వీఆర్​కు అటాచ్​ చేశారు. సీసీఎస్​లో ఉన్న రమేశ్​ను ఆర్మూర్​ పీఎస్​ ఎస్సై–1గా నియమించారు. నిర్మల్​ జిల్లా లక్ష్మణచందా పీఎస్​ ఎస్సై మాలిక్​ రెహమాన్​ను జక్రాన్​పల్లి ఎస్సైగా బదిలీ చేశారు. రెండో టౌన్​లో ఉన్న ఎస్సై యాసిర్​ అరాఫత్​ను మెండోరా ఎస్సైగా నియమించారు. జగిత్యాల్​ వీఆర్​లో ఉన్న సయ్యద్​ ఇమ్రాన్​ను రెండో ఎస్సై–1గా ట్రాన్స్​ఫర్​ చేశారు.