24.1 C
Hyderabad
Monday, August 3, 2026

పలువురు సీఐల బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఎనిమిది మంది సీఐలను బదిలీ​ చేశారు. ఇందులో ముగ్గురికి ఎక్కడ పోస్టింగ్​ ఇవ్వకపోవడం గమనార్హం. మల్టీ జోన్​–1 పరిధిలో పని చేస్తున్న పలువురు సీఐలను జూన్​ 23న ట్రాన్స్​ఫర్​ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 8 మందికి స్థానచలనం కల్పించారు. వెయింటింగ్​లో ఉన్న సీఐ నల్లమోతు చిట్టిబాబును ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్​కు బదిలీ​ చేశారు. అక్కడ పని చేస్తున్న తుమ్మలపల్లి శ్రీహరిని సత్తుపల్లికి బదిలీ చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని తాండూర్​లో విధులు నిర్వహిస్తున్న కన్నం కుమారస్వామిని మధిరకు, కామారెడ్డి సీఎస్​బీలో పనిచేస్తున్న తిరుపయ్యను బాన్సువాడ రూరల్​కు పంపించారు. వెయిటింగ్​లో ఉన్న ఆర్ బన్సీలాల్​ను రామగుండం కమిషనరేట్ పరిధిలోని చెన్నూర్ సర్కిల్​కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సత్తుపల్లి సీఐగా పనిచేస్తున్న తెల్లబోయిన కిరణ్, మధిర సీఐ దొంగరి మధు, బాన్సువాడ సీఐ తోకల రాజేష్​ను హైదరాబాద్​లోని మల్టీజోన్-1 ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

More articles

Latest article