పలువురు సీఐల బదిలీ

హైదరాబాద్, బతుకమ్మ : మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఎనిమిది మంది సీఐలను బదిలీ​ చేశారు. ఇందులో ముగ్గురికి ఎక్కడ పోస్టింగ్​ ఇవ్వకపోవడం గమనార్హం. మల్టీ జోన్​–1 పరిధిలో పని చేస్తున్న పలువురు సీఐలను జూన్​ 23న ట్రాన్స్​ఫర్​ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 8 మందికి స్థానచలనం కల్పించారు. వెయింటింగ్​లో ఉన్న సీఐ నల్లమోతు చిట్టిబాబును ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్​కు బదిలీ​ చేశారు....