24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బంజారాల మధ్య చిచ్చుపెడితే ఊరుకునేదిలేదు

Must read

📰 Generate e-Paper Clip

  • ఆలిండియా బంజారా సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చంద్రునాయక్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అన్నదమ్ముల్లా కలిసి ఉన్న బంజారాలను విడిదీసేందుకు రాజ్యంగ బద్ధంగా ఎన్నుకున్న ఆలిండియా బంజారా సేవా సంఘం కమిటీలను కాదని సీల్డ్ కవర్ నియామకాలు చేస్తు చిచ్చుపెడుతున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తీరు మార్చుకోవాలని సంఘం గౌరవ అధ్యక్షులు చంద్రునాయక్ హెచ్చరించారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆలిండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గానికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలిండియా బంజారా సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చంద్రునాయక్ మాట్లాడుతు.. బంజారాల (లంబాడా) ల హక్కుల కోసం  పనిచేస్తు, రాజకీయంగా ఉన్నత పధవులు అనుభవించిన రాములు నాయక్ తన స్వార్థ ప్రయోజనాల కోసం కొత్తగా కమిటీలను నియమాకం చేయరాదని అన్నారు. నిజామాబాద్ జిల్లా కమిటీని జిల్లాలోని అన్ని మండలాల కార్యవర్గాలతో కలిసి రాజ్యంగ బద్ధంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆలిండియా బంజారా సేవా సంఘం జాతీయ కమిటీతో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కు అసలు సంబంధం లేదన్నారు. త్వరలో జాతీయ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కు మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిల దగ్గర మంచిపేరు ఉండగానే సరిపోదని అన్నారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బంజారాల కమ్యూనిటీకి మంత్రి పదవి కావాలని ధర్నాకు పిలుపినిస్తే అందరం కలిసి పోరాడుదాం అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం వ్యవసాయ కమీషన్ సభ్యులుగా రాములు నాయక్ బంజారాల అభ్యున్నతికి పాటుపడితే హర్షిస్తామన్నారు. పోడు భూముల సాధనకు జరిగే ఉద్యమంలో కలిసి వస్తే స్వాగతిస్తామని అంతేగాని బంజారాల మధ్య బేదాభిప్రాయాలకు తావు ఇస్తే మాత్రం ఉరుకునేది లేదని చంద్రునాయక్ హెచ్చరించారు.

  • ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా కార్యవర్గానికి సన్మానం..

ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా కార్యవర్గాన్ని జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రు నాయక్ ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షులు మూడ్ బాబూరాం నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ నాయక్, మిడియా ఇంచార్జ్ సురేష్ నాయక్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాథోడ్ విఠల్ నాయక్, మోపాల్ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, యువజన విభాగం నాయకులు వినోద్ నాయక్ లను చంధ్రునాయక్ సన్మానించారు.  ఈసందర్భంగా నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన బాబురాం నాయక్ మాట్లాడుతు… నిజామాబాద్ జిల్లాలో బంజారాల అభ్యున్నతికి అందరి సహయ సహకారాలతో పాటు పడుతానని అన్నారు. బంజార విద్యార్ధులకు ఫిజు రియింబర్స్ మెంట్, బెస్ట్ అవైలేబుల్ విద్యకు అధికారులను, పాలకులను కలిసి సాధిస్తానని అన్నారు. జిల్లాలో గిరిజనుల ప్రధాన సమస్యఐనా పోడు భూముల వ్యవహరంపై  అధికార పార్టీ నేతల ధ్రుష్టికి తీసుకువిళ్లి  పరిష్కరానికి పాటు పడుతానని అన్నారు.

If you put a fence between the bushes, you won't be able to keep it down.

More articles

Latest article