24 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రంలో సీఐల బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  మల్టీ జోన్​ –1 పరిదిలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. మొత్తం పది మంది ఇన్​స్పెక్టర్లను ట్రాన్స్​ఫర్​ చేస్తూ ఐజీ చంద్రశేఖర్​రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లూప్​లైన్​లో ఉన్న కొందరికి పోస్టింగ్​లు ఇవ్వగా.. కీలక పోస్టింగ్​ల్లో ఉన్న వారిని ఆయా బాధ్యతల నుంచి తప్పించారు. పాలకుర్తి సీఐ మహేందర్​రెడ్డిని మహబూబాబాద్​ టౌన్​ పీఎస్​ ఎస్​హెచ్​వోగా బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న పెండ్యాల దేవేందర్​ను ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. ట్రాన్స్ కోలో ఉన్న కందరి వినోద్​ను డిచ్పల్లి సీఐగా.. అక్కడ పని చేస్తున్న కొంక మల్లేశ్​ను ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. రామగుండం ఎస్​బీలో ఉన్న కరుణాకర్​ను జగిత్యాల టౌన్​ పీఎస్​ ఎస్​హెచ్​వోగా.. అలాగే అక్కడ పనిచేస్తున్న వేణుగోపాల్​ను ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. చెన్నూర్​ సర్కిల్ ఇన్​స్పెక్టర్​ సుధాకర్​ను​ జగిత్యాల రూరల్ సీఐగా.. అక్కడ పనిచేస్తున్న కృష్ణారెడ్డిని ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. అలాగే వెయిటింగ్​లో ఉన్న మహేశ్​ను మెదక్​ టౌన్​ పీఎస్​ ఎస్​హెచ్​వోగా నియమించారు. అక్కడ కొనసాగుతున్న కొమళ్ల నాగరాజును ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. బదిలీ అయిన వారు అంతా సత్వరమే తమ నూతన పోస్ట్​లలో రిపోర్ట్​ చేయాలని ఐజీ ఆదేశించారు.

More articles

Latest article