29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బోర్లం గురుకులంలో విషాదం

Must read

📰 Generate e-Paper Clip

. . .  8వ తరగతి విద్యార్థిని మృతి

 

 బాన్సువాడ, బతుకమ్మ  : 

 

బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో సోమవారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో బెంచీలు తరలిస్తుండగా, ప్రమాదవశాత్తు 8వ తరగతి విద్యార్థిని సంగీత (13) మృతి చెందింది.వివరాల మేరకు… ఆటో నుంచి బెంచీలు దించుతున్న సమయంలో అవి అదుపు తప్పి సంగీత తలకు బలంగా తగలడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఉపాధ్యాయులు ఆమెను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలు మద్నూర్ మండలం కోడిచెర్ల గ్రామానికి చెందినదిగా గుర్తించారు.  ఈ ఘటనతో గురుకుల పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. సహ విద్యార్థులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. విద్యార్థిని తల్లిదండ్రులు  ఆసుపత్రికి ఆందోళన చేపట్టారు. వారికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సముదాయించి ఆందోళన విరమింప చేశారు. విద్యార్థిని మృతి పై  విచారణ జరిపిస్తామని, రాజులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తుల శ్రీధర్ తెలియజేశారు.

More articles

Latest article