29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

భారత రాజ్యాంగం గొప్పది

Must read

📰 Generate e-Paper Clip

 

.  .  .   నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి 

 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం చాలా గొప్పదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో గల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం 77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది మహానుభావుల త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చిందని, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఇలా పరిపాలించుకోవాలో అన్న నేపథ్యంలో మన భారతదేశానికి రాజ్యాంగం కావాలని , భారతదేశానికి రాజ్యాంగం రచించుకోవడం జరిగిందని. దీనికి చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యవహారించి, మన దేశానికి సమాన హక్కులు సమాన అవకాశాలు, సమాన అభివృద్ధిని చేసుకోవడానికి పెద్ద రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని అన్నారు. ఈ రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని అన్నారు. స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, నెహ్రూ, వంటి నాయకులు ఎన్నోసార్లు జైల్లోకి వెళ్లారని, దేశాన్ని కాపాడుకున్నారని అన్నారు. ప్రస్తుతం మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చి, భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు. దేశంలో ఎక్కలేని సంక్షేమ పథకాలు మా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని అన్నారు.నిజామాబాద్ రూరల్ ప్రజలకు జిల్లా ప్రజలకు, దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీసీ డెలికెట్ శేఖర్ గౌడ్, జిల్లా ఫిషర్శిష్ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సాయరెడ్డి, బాగారెడ్డి, అమృత పూర్ గంగాధర్, పోలసాని శ్రీనివాస్, రాంచందర్ గౌడ్, ఉమ్మాజీ నరేష్,. చంద్ర శేఖర్ రెడ్డి, జనార్దన్, తరుణ్, శేఖర్ రెడ్డి, అశోక్, అనిల్ రెడ్డి, ఆకాష్ రెడ్డి,. హన్మాండ్లు, రమేష్ రెడ్డి , వెంకట్ రెడ్డి, నవీన్, రఘు, వినోద్. కుమార్, సంజీవ్ రెడ్డి, మహేందర్, మధు గౌడ్, వేణు గౌడ్, మల్లారం రమేష్ , శిరీష, ప్రవళిక కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

The Indian Constitution is great.

 

More articles

Latest article