నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని బోధన్ బస్టాండ్ నుంచి అర్సపల్లి ఎక్స్ రోడ్డు వరకు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాకర్స్ కోసం బోధన్ రోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలని ఎంఐఎం నగర అధ్యక్షుడు మహ్మద్ షకీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నాయకులు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోధన్ బస్టాండ్, మాలపల్లి, అర్సపల్లి ఎక్స్ రోడ్డులతోపాటు, డెయిరీ ఫారం చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రజల ఇబ్బందులను దూరం చేయడంతోపాటు ప్రమాదాలను నివారించేందుకు సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ లు ఏర్పాటు చేయాలని విన్నవించామన్నారు.
వినతిపత్రం అందజేసిన వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ అహ్మద్, నగర కార్యదర్శి ముజీబ్ హైమద్, జాయింట్ సెక్రెటరీలు అజీజ్ హుస్సేన్, ఎండీ అవైజ్ అహ్మద్, కోశాధికారి మహ్మద్ అయాజ్ అహ్మద్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లు ఎండీ నజీర్, ఎండీ రియాజ్, అనీజ్ ఖాన్ రాహి, ఎంఏ అజీమ్ బాబా, షేక్ ఖలీల్ అహ్మద్, మిర్జా అఫ్జల్ బేగ్, అమీర్ తదితరులు ఉన్నారు.