27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం అందిస్తున్న పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. గురువారం మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామపంచాయతీ కార్యాలయంలో  ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం మంజూరైన పత్రాలను అందించడం జరిగింది. ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరు ఇంటిని త్వరగా నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు బద్దం దేవేందర్, బక్కురి ఆనంద్, పుప్పాల రాజు, పెగడ లక్ష్మీ, బబ్బూరి చిన్నరాజు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్మ రంజిత్, కారోబార్ పృథ్వి రాజ్, పంచాయతీ సిబ్బంది రాజ్ కుమార్, దేవన్న, భూమన్న, భూమేశ్వర్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article