నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని అర్సపల్లి వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతు పనులను శుక్రవారం నిర్వహించారు. అర్సపల్లి రైల్వే గేట్ దగ్గర రోడ్ పైన పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి ప్రజలకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరుచుగా ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో ఏ ఆర్ ఎస్ ఐ కోటేశ్వరరావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ పవన్ కుమార్ మొరం వేయించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టి గుంతలను పూడ్చారు. ప్రస్తుతం రాకపోకలు సజావుగా సాగుతున్నాయని అన్నారు. రోడ్డు మరమ్మత్తు చేయించిన ట్రాఫిక్ సిబ్బందిని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అభినందించారు.

