Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 6:26 pm Posted by : ramakrishna

రోడ్డుపై గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని అర్సపల్లి వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతు పనులను శుక్రవారం నిర్వహించారు. అర్సపల్లి రైల్వే గేట్ దగ్గర రోడ్ పైన పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి ప్రజలకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరుచుగా ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో  ఏ ఆర్ ఎస్ ఐ కోటేశ్వరరావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ పవన్ కుమార్ మొరం వేయించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టి గుంతలను పూడ్చారు. ప్రస్తుతం రాకపోకలు సజావుగా సాగుతున్నాయని అన్నారు.  రోడ్డు మరమ్మత్తు చేయించిన ట్రాఫిక్ సిబ్బందిని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అభినందించారు.

Traffic police fill potholes on the road