వెబ్ న్యూస్, బతుకమ్మ: దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు బుధవారం భారత్ బంద్ చేపట్టాయి. 8 గంటల పని విధానం, కొత్త లేబర్ కోడ్ ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు పలు చోట్ల ఆందోళనకు దిగాయి. వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు ’ఎక్స్‘ వేదికగా ఎమ్మెల్సీ కవిత మద్దతు ప్రకటించారు. కార్మికుల హక్కులను కాలరాసే కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

