24.5 C
Hyderabad
Friday, July 31, 2026

టోసా మిడ్ టర్మ్ 2024 సీ పీ డి గ్రాండ్ సక్సెస్

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి టోసా ఆధ్వర్యంలో సీ ఎం ఈ
  • రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఆర్థో డాక్టర్ల హాజరు
  • లెగ్ ఫ్రాక్చర్స్ లో ఆధునిక వైద్యం పై ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలు

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ (టీ. ఓ. ఎస్. ఏ )టోసా సౌజన్యం తో ప్రతి యేటా జిల్లా కేంద్రాల్లో నిర్వహించే తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ మిడ్ టర్మ్ 2024 కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వర్క్ షాప్ అండ్ ఎక్స్బిషన్ ప్రోగ్రాంను కామారెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పర్ణిక ప్లేస్ లో నిర్వహించారు. ప్రతి యేడు ఒక్కొక్క జిల్లా కేంద్రంలో నిర్వహించే ఈ స్టేట్ లెవల్ ఆర్థోపెడిక్స్ కాన్ఫరెన్స్ కు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్లు హాజరయ్యారు. ఈ రాష్ట్ర స్థాయిలో ఆర్థో డాక్టర్స్ కాన్ఫరెన్స్ కు చీఫ్ గెస్ట్ గా తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమీషనర్ డాక్టర్.అజయ్ కుమార్హాజరయ్యారు. ఈ స్టేట్ కాన్ఫరెన్స్ లో టోసా స్టేట్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్.డాక్టర్. తిమ్మారెడ్డి, స్టేట్ సేక్రెటరీ డాక్టర్. కాస శ్రీనివాస్ లు ప్రధాన వక్తలుగా హాజరై కాలి నడుము భాగం నుండి పాదం వరకు జరిగే ఫ్రాక్చర్ ల అదునాతన వైద్య విధానం గురించి క్లుప్తంగా వివరించారు. ఈ ప్రక్రియాలో నూతన డైగ్నోసిస్, ప్రొసీజర్స్, సర్జరీ, ట్రీట్మెంట్ గురించి ఆర్థో వైద్యులకు పలు కీలక సలహాలు, సూచనలను అందించారు.ఈ బృహత్తర రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ కు ఎప్పుడు, ఎన్నడు లేని విధంగా రాష్టంలో నలుమూలల జిల్లాల నుండి ఆర్థో డాక్టర్లు, రాష్ట్రంలోని 60 మెడికల్ కాలేజ్ ల నుండి ఆర్థో పీ. జీ స్టూడెంట్లు 480 మంది హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ కామారెడ్డి సీ ఎం ఈ కి హాజరైనంత మంది వైద్యులు ఏ సీ ఎం ఈ కి హాజరువ్వలేదని వ్యక్తలు తెలిపారు. కామారెడ్డి టోసా కాన్ఫరెన్స్ ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు గెస్ట్ లకు, డాక్టర్లకు, మెడికల్ స్టూడెంట్లకుకామారెడ్డి టోసా ప్రెసిడెంట్ డాక్టర్. చంద్ర శేఖర్ రెడ్డి, సెక్రటరీ ప్రొఫెసర్.డాక్టర్. బన్సీలాల్ లు కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఆర్థో డాక్టర్స్ కాన్ఫరెన్స్ లో డాక్టర్.ప్రవీణ్ రావు ఓ ఏ ఎస్ కే టీం డాక్టర్లు మధుసూదన్, ప్రవీణ్, భాను తేజా, చంద్ర శేఖర్, నాగార్జున, శ్రవణ్, ఉపేందర్, జీవన్, రాకేష్ , వివిధ జిల్లాలకు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్లు, మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, మెడికల్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

TOSA MID TERM 2024 C PE D GRAND SUCCESS

More articles

Latest article