. . . ప్రభుత్వం నుంచి 1.30 కోట్లు నిధులు వచ్చినా ఆగని వసూళ్ళు
. . . టీజీవీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవలైబుల్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో ప్రైవేట్ విద్యను ఉచితంగా అందిస్తుంటే ఆ స్కీం కింద ఉన్న విజ్ఞాన్ స్కూళ్లో అక్రమంగా వసూళ్ళు చేశారని తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ ఆరోపించారు. శనివారం టీజీవీపీ కార్యాలయంలో బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్ యాజమాన్యం ‘బెస్ట్ అవైలబుల్’ పథకం కింద ప్రభుత్వం నుంచి 2023 నుండి 2026 వరకు మూడేళ్లలో సుమారు 1,29,19,920 రూపాయలు నిధులు విడుదలయ్యాయని తెలిపారు. కానీ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి బకాయిలు రాలేదని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా ప్రతి యేడాది రూ. 32,000 చొప్పున వసూలు చేసిందని తెలంగాణ విద్యార్థి పరిషత్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ తెలిపారు. తల్లితండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు సమాచార హక్కు చట్టం ద్వారా మేము తీసుకున్న అధికారిక సమాచారం ప్రకారం యూనిఫాం, బుక్స్ లేదా వసతి కోసం అదనపు ఫీజులు వసూలు చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ ఆర్ టిఐ లో స్పష్టం చేసిందన్నారు. అయితే తల్లి తండ్రుల ఫిర్యాదు ప్రకారం 2022 నుండి 2025 వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు తమకు అందడం లేదని పాఠశాలయాజమన్యం విద్యార్థుల నుండి 32,000 (ధోబీ,ఆహారం,బుక్స్, యూనిఫాం)కోసం అక్రమంగా వసూలు చేసిందని,వసూలు సమయంలో ప్రభుత్వం నుండి నిధులు విడుదల అవగానే తిరిగి చెల్లిస్తామని చెప్పారని, కానీ ఇప్పటి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారన్నారు. అధికారులకు చాలా సార్లు పిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. టీజీవీపీ అడిగిన సమాచారంలో దాదాపు 80 ఫిర్యాదులు అందినట్లు అధికారులే తెలిపారు. పైగా స్కూల్లో ఫైర్ సేఫ్టీ అధికారుల నుండి అనుమతులు కూడా తీసుకోలేదని, కనీస వసతులు లేవని, ఇలాంటి స్కూల్ ని బెస్ట్ స్కూల్ గా అధికారులు ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు. అర్హత లేని ఉపాధ్యాయులను నియమించారని, పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు,స్టాఫ్ కి పీఎఫ్ కూడా చెల్లించడం లేదని సమాచార హక్కు చట్టం ప్రకారం తెలిసిందన్నారు. ఇంత వైట్ కలర్ స్కామ్ చేస్తున్న అధికారులు చర్యలు తీసుకోకాపోవడంలో అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు అని వాపోయారు. వెంటనే యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సమగ్ర విచారణ జరిపి బాధిత తల్లి తండ్రులకు న్యాయం చేయాలని, విద్యాశాఖ అధికారి పాఠశాలకు సంబంధించిన అన్ని అర్హతలను మరో మారు పరిశీలించి విచారణ జరపాలని తల్లిదండ్రుల నుంచి అక్రమంగా వసూలు చేసిన ₹32,000 తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీజీవీపీ ఆఫీస్ ని సంప్రదించిన తల్లిదండ్రుల తో కలిసి డిఈఓ ఆఫీస్ ముందు ఆందోళన దిగుతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో అనిరుధ్, రాజ్, కామారెడ్డి ఇంచార్జ్ ,నైతిక్,సాయి,సూరజ్ తదితరులు పాల్గొన్నారు.
