- నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటున్న గ్రామస్తులు
- లడ్డు వేలం పాటలో పోటాపోటీగా పాల్గొన్న భక్తులు
- శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్సై మనోజ్ కుమార్
ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో గత తొమ్మిది రోజులుగా గణనాథునికి విశిష్ట పూజలు నిర్వహించి నేడు నిమజ్జనోత్సవానికి సన్నద్ధమవుతున్నరు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కొలిచే గణనాథునికి నిత్యం ప్రతిరోజు పూజలు, భజనలు, కీర్తనలు చేసి తమ కుటుంబాలలో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. అడిగిన వెంటనే కోరిన వరాలను ఇచ్చే దైవంగా భక్తులు గణనాథుని కొలుస్తుంటారు. నేడు గణనాథుని నిమజ్జనోత్సవం ఉండడంతో మండపాల దగ్గర లడ్డు వేలం పాటను పోటాపోటీగా నిర్వహించారు. గణనాథుని నిమజ్జన ఉత్సవాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై మనోజ్ కుమార్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీజే సౌండ్ లు వాడొద్దని మండల వాసులకు సూచించారు. నిమజ్జనోత్సహంలో అల్లర్లు సృష్టించినట్లైతే కేసులు చేయడం జరుగుతుందని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.
