నేడు గణనాథుని నిమజ్జనోత్సవం

నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకుంటున్న గ్రామస్తులు లడ్డు వేలం పాటలో పోటాపోటీగా పాల్గొన్న భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్సై మనోజ్ కుమార్ ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో గత తొమ్మిది రోజులుగా గణనాథునికి విశిష్ట పూజలు నిర్వహించి నేడు నిమజ్జనోత్సవానికి సన్నద్ధమవుతున్నరు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కొలిచే గణనాథునికి నిత్యం ప్రతిరోజు పూజలు, భజనలు, కీర్తనలు చేసి తమ కుటుంబాలలో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. అడిగిన వెంటనే కోరిన వరాలను ఇచ్చే దైవంగా భక్తులు గణనాథుని కొలుస్తుంటారు. నేడు...