27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

టీఎన్జీవో కేంద్ర సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎమ్. హుస్సేని (ముజీబ్) అధ్యక్షతన, మర్రి చెన్నారెడ్డి మానవనుల ఇనిస్టిట్యూట్ (MCHRD) కాన్ఫరెన్స్ హాల్లో  టీఎన్జీవో కేంద్ర సంఘ డైరీ & క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి, టీఎన్జీవో కేంద్ర సంఘ డైరీ, క్యాలెండర్ ని ఆవిష్కరించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలకు, రాష్ట్ర కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేరవేయుటలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఉద్యోగులందరికీ, అభినందించారు. ఉద్యోగుల సమస్యల పట్ల, ప్రభుత్వంతో సమన్వయపరచుకొని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. త్వరలో టిఎన్జీవో 80 వసంతాల కార్యక్రమము హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నందు అట్టహాసంగా  నిర్వహించుకోబోతున్నామని తెలిపారు. అనంతరం సీఎస్ కి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేసి, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. టిఎన్జీవో కేంద్ర సంఘ పక్షాన సీఎస్ ని, ఘనంగా సన్మానించి, ఆత్మీయ జ్ఞాపికను అందజేశారు. ఇట్టి కార్యక్రమానికి టీఎన్జీవో నిజాంబాద్ జిల్లా పక్షాన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టిఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మచ్చుకూరి సతీష్ హాజరైనారు.

More articles

Latest article