23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మొత్తం 1,605 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు

 

. . . మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి

 

మహబూబ్ నగర్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రానికి రానున్న సందర్భంగా జిల్లా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. శుక్రవారం సీఎం పర్యటనకు సంబంధించిన సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ మార్గాలు, హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలను ఎస్పీ ప్రత్యక్షంగా పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సీఎం పర్యటన సజావుగా జరిగేలా ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించిన ఎస్పీ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ, ప్రజల రాకపోకలు, భద్రతా అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా సభా ప్రాంగణానికి విచ్చేయనున్న బస్సులకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కల్వకుర్తి నుండి మిడ్జిల్‌కు వచ్చే వాహనాలు బస్సులు – పార్కింగ్ 2 & 3 (రైస్ మిల్ వెనకాల), ఫోర్ వీలర్స్ & టూ వీలర్స్ – పార్కింగ్ 4 & 5 (రైస్ మిల్ ముందు), వీఐపి వాహనాలు – పార్కింగ్ 6, సంత బజార్ దగ్గర పార్క్ చేయాలన్నారు. అలాగే జడ్చర్ల నుండి మిడ్జిల్‌కు వచ్చే వాహనాలు బస్సులు – పార్కింగ్ 1 (ఎంఆర్వో ఆఫీస్ ఎదురుగా), ఫోర్ వీలర్స్ & టూ వీలర్స్ – పార్కింగ్ 8 (బాల్‌రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా), వీఐపీ వాహనాలు – పార్కింగ్ 9, సభా ప్రాంగణం వెనుక పార్క్ చేసుకోవాలన్నారు. తలకొండపల్లి / వెల్జాల నుండి మిడ్జిల్‌కు వచ్చే అన్ని వాహనాలు పార్కింగ్ 7, వెల్జాల రోడ్‌లోని పాత రైస్ మిల్ వెనుక పార్క్ చేసుకోవాలని కోరారు. సీఎం సభకు హాజరయ్యే ప్రజలు, ప్రజాప్రతినిధులు, వాహనదారులు పోలీసు శాఖ సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా అమల్లో ఉంటా యని, రెగ్యూలర్ వాహనదారులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అనంతరం బందోబస్తు విధుల నిమిత్తం విచ్చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి మిడ్జిల్ మండల కేంద్రంలోని యం.వి.ఎస్ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని, సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని, విధుల్లో ఉన్న ప్రతి సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ బ్రీఫింగ్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.బి.రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సీఎం పర్యటనకు ఇద్దరు ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు, 13 మంది డీఎస్పీలు, 46 మంది సీఐలు, 90 మంది ఎస్సైలు, 410 మంది ఏఎస్సై /హెచ్ సీలు, 795 మంది కానిస్టేబుళ్లు, 235 మంది హోంగార్డులతో మొత్తం 1,605 మంది సిబ్బందితో భారీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి, విధుల్లో ఉన్న సిబ్బంది సూచనలను పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

 

Tight security arrangements for the CM's visit.

More articles

Latest article