. . . పార్టీలకు అతీతంగా పాల్గొన్న మైనార్టీ నాయకులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ చేయడాన్ని ముస్లీంలు ఖండించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని ముస్లిం మైనార్టీ సమాజాన్ని బలహీన పరిచే లా కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు చట్టం సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం నగరంలోని అర్సపల్లి నుంచి నగరంలో నెహ్రూ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ …. ఎట్టి పరిస్థితుల్లో వక్ఫ్ బిల్లును అమలు కానివ్వం చట్ట ప్రకారం కోర్టుల ద్వారా దాన్ని అడ్డుకుంటాం అన్నారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు లో సొంత ఖర్చులతో పిటిషన్ దాఖలు చేశాను అని గుర్తు చేశారు. వక్ఫ బిల్ చట్టం చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో విచారణ మొదలు పెట్టింది కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ వివరణ కోరిందన్నారు.

విచారణకు ముందు సుప్రీంకోర్టు తమ ఎదుట రెండు ప్రశ్నలు ఉన్నాయని అవి మొదటిది కేసును విచారించాలా? లేదంటే హైకోర్టుకు అప్పగించాలా? అని పేర్కోన్నదని అన్నారు. పార్లమెంట్ చట్టం ద్వారా మత విశ్వాసంలో కీలకమైన అంతర్భాగ అంశాల్లో తలదూర్చడమే అన్నారు ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపాము అన్నారు చట్టం ప్రకారం అనే పదాలు అనే పదాలు ముస్లిం మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాన్ని ప్రభావితం చేస్తాయని,ఈ పదబంధం ఇస్లాం మతానికి సంబంధించిన మౌలికమైన ఆచారాలను దూరం చేస్తుందని పేర్కొన్నారు. ఆస్తుల సర్వే బాధ్యత కలెక్టర్‌కు ఇచ్చారని.. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. గతంలో ముస్లింలు మాత్రమే వక్ఫ్ కౌన్సిల్, బోర్డులో భాగమని.. సవరణ తర్వాత హిందువులు కూడా భాగం కావొచ్చని.. ఇది పార్లమెంట్ చట్టం ప్రాథమిక హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనని అన్నారు.

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పై మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, కమిటీ కన్వీనర్ కరీముద్దీన్ కమాల్, హఫీజ్ లాయక్ ఖాన్ , మాజీ కార్పొరేటర్లు హరోణ్ ఖాన్, ఖుద్దూస్, ముజాహిద్ లతో పాటు మైనార్టీ నాయకులు జావేద్ ఆక్రం, సుమేర్ హైమద్ లతో పాటు, యువత పాల్గోన్నారు.
