- కేంద్రం వద్ద సీబీఐ ఈడీలు ఉండగా ఎందుకు చర్యలు తీసుకోలేదు
- రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలపై మూడు కమిషన్ల రిపోర్ట్ ల ఆధారంగా చర్యలు
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులై ఉన్నారని అందులో భాగంగానే ఇప్పటికే మూడు జ్యుడిషియల్ విచారణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని నెల, రెండు నెలల్లోనే బాధ్యులపై చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్టు హౌజ్ లో షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనడం హ్యాస్పాస్పదమన్నారు. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ లేని చోటనే కేంద్రం సీబీఐ, ఈడి, ఇన్ కాంటాక్స్ డిపార్ట్ మెంట్ లను పెట్టి పాలకులను వేదిస్తుందని ఆరోపించారు. గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడి ప్రభుత్వం తెలంగాణలో జరిగిన అవినీతి, అక్రమాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని అందులో భాగంగానే అవినీతి, అక్రమాలపై కమిషన్లు వేశామని వారు ఇచ్చే రిపోర్టులు ఆధారంగా చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను కేంద్రం ఎందుకు గౌరవించడం లేదని షబ్బీర్ ఆలీ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ఇస్తున్న వసతులు, నిధుల విషయంలో తెలంగాణ కోరుతున్న ఒక్క ప్రాజెక్టు అయినా ఓకే చెప్పిందా అని ప్రశ్నించారు. మోడి సర్కార్ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసంక్షేమం కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణలో కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉండి ఏ ప్రాజెక్టు అయినా తెచ్చారా? ప్యాక్టరి తెచ్చారా? విద్యా సంస్థలను నెలకొల్పారా అని షబ్బీర్ ప్రశ్నించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటును ప్రారంభించిందే ప్రారంభిస్తూ దానికి ఒక్క రూపాయి అయినా బడ్జెట్ లో కేటాయించారా , ఒక్కఫ్యాక్టరి నెలకోల్పారా అని నిలదీశారు. ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ మనిషి అని అందుకే ఆయన చనిపోయినప్పుడు కూడా పార్టీ గౌరవం ఇచ్చిందని గుర్తు చేశారు. ఆయనకు గాంధీ కుటుంబంలో మంచి సంబంధాలు ఉండేవని ఆయన చివరి దశలోనూ పార్టీలో చేరడానికి సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తేనని ఆయన విగ్రహాన్ని మాత్రం బీజేపీ నేతతో ఆవిష్కరించిన విషయం కుటుంబ సభ్యులకే తెలుసునని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ధర్మపురి శ్రీనివాస్ కు గౌరవం ఇచ్చి ఆయన విగ్రహాన్ని నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిందని పార్టీ ఆయన సేవలను ఎన్నడు మరువదని అన్నారు.